ఆహా చరణ్ తారక్ లు ఎంత లక్కీనో

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణంతో హోరెత్తిపోతోంది. ఎవరు గెలుస్తారు ఎవరు ప్రతిపక్షం అవుతారు అనే చర్చలతో జనానికి ఇంకో టాపిక్ పట్టడం లేదు. నిర్మాతలు ఈ కారణంగానే మార్చ్ నెలను పూర్తిగా పక్కనపెట్టేశారు. టాలీవుడ్ లో సైతం కొందరు నటీనటులు పార్టీల తీర్థం పుచ్చుకోవడం ప్రచారంలో యాక్టివ్ గా ఉంటూ షూటింగ్ లకు సైతం బ్రేకులు ఇవ్వడం గమనిస్తూనే ఉన్నాం.

అయితే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు మాత్రం ఈ వ్యవహారాలకు దూరంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీ కావడం అభిమానులకు ఓ పక్క సంతోషంగానే ఉన్నా మరోపక్క ప్రచారానికి వచ్చి ఉంటె టిడిపి జనసేనలకు ఎంతో హెల్ప్ అయ్యేదని అనుకుంటున్నారు.  ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ పేరుతో ఈ ఇద్దరు ఇప్పుడు వడోదరలో ఎంజాయ్ చేస్తున్నారు 45 రోజుల పాటు సాగే సుదీర్ఘమైన షెడ్యూల్ లో అహ్మదాబాద్ ముంబై పూణే తదితర ప్రాంతాల్లో కీలకమైన ఎపిసోడ్స్ ని షూట్ చేయబోతున్నారు. 

ఇక్కడ రాజకీయ వేడికి దూరంగా చరణ్ తారక్ లు ఇద్దరు ఖాళీ దొరికితే చాలు బయటికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారట. ఓ టూ వీలర్ మీద చక్కర్లు కొడుతున్న లీక్డ్ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఎలాగూ ఇంకో తొమ్మిది రోజుల్లో పోలింగ్ అయిపోతుంది. ఆ టైంకి వచ్చి ఓటు వేస్తారా లేదా అనేది ఇంకా డౌట్ గానే ఉంది. టిడిపికి తారక్ ఎప్పటి నుంచో దూరంగా ఉన్నాడు. చరణ్ బాబాయ్ జనసేనకు ఇంతకు ముందు బహిరంగ మద్దతు తెలిపాడు కానీ ఇప్పుడు బయటికి వచ్చే పరిస్థితి లేదు. కారణాలు ఏవైతేనేం మొత్తానికి నందమూరి కొణిదెల హీరోలకు ఎన్నికల గోల తప్పింది

Leave a Reply

*