మజిలీ: సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసిందోచ్

అక్కినేని నాగచైతన్య – సమంత నటిస్తున్న ‘మజిలీ’ ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.  రీసెంట్ గానే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు.  అక్కినేని నాగార్జున.. వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరైన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.

ఇదిలా ఉంటే ‘మజిలీ’ సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.   సినిమాను చూసిన సెన్సార్ అధికారులు ‘యూ/ఎ’ సర్టిఫికేట్ ను జారీ చేసినట్టుగా సమాచారం అందుతోంది. సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది కాబట్టి ఇక సినిమా రిలీజ్ కు అంతా సిద్ధంగా ఉన్నట్టే.   విడుదలకు ముందుగా చైతు- సమంతాల తో పాటు చిత్ర నిర్మాతలు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వెళ్ళారట. 

క్రికెటర్ గా ఉన్న ఓ యువకుడు అనుకోని సంఘటనల వల్ల ప్రేమించిన ఆమ్మాయికి దూరం కావడం.. మరో అమ్మాయిని ఇష్టంలేకుండా పెళ్లి చేసుకొని రావడంతో క్రికెట్ కు దూరం అవుతాడు. ప్రేమలో ఫెయిల్  అయ్యి.. ఫ్రస్ట్రేషన్ తో అదోరకంగా ప్రవర్తిస్తున్న ఆ మనిషిని భార్య ఎలా భరించింది.. ఎలా మార్చుకుంది అనే పాయింట్ తో ఈ సినిమా కథ ఉంటుందని ట్రైలర్ లోనే దర్శకుడు హింట్ ఇచ్చాడు.  మరి ఈ ఎమోషనల్ డ్రామాలో చై-సామ్ లు ఎలా నటించారో తెలియాలంటే మరో రెండు మూడురోజులు వేచి చూడాలి.

Leave a Reply

*