మన్మథుడి వ్యూహంలో…

‘మజిలీ’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది సమంత. తన చేతిలో రెండు సినిమాలున్నాయి. ‘ఓ బేబీ’ పూర్తి కావొచ్చింది. ‘96’ రీమేక్‌ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోగా తన ఖాతాలో మరో రెండు చిత్రాలు చేరాయని సమాచారం. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపు దిద్దుకుంటోంది. నాని, సుధీర్‌బాబు కథా నాయకులు. ఈ చిత్రానికి ‘వ్యూహం’ అనే పేరు పరిశీలిస్తున్నారు. కథానాయికగా సమంతని ఎంచుకున్నారని సమాచారం. మరోవైపు నాగార్జున చిత్రంలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథా నాయిక. ఈ చిత్రంలో సమంతకూ ఓ పాత్ర దక్కిందని, కథానాయిక కాకపోయినా అంతటి ప్రాధాన్యం ఆ పాత్రకు ఉందని సమాచారం. సమంతకు రాహుల్‌ రవీంద్రన్‌ మంచి స్నేహితుడు. తన స్నేహితుడి కోసం ఈ చిత్రంలో నటించడానికి సమంత అంగీకారం తెలిపిందట.

Leave a Reply

*