మార్వెల్‌ ఫ్యాన్స్‌ కోసం రెహమాన్‌ పాట

ముంబయి: ఆస్కార్‌ అవార్డుల గ్రహీత ఎ.ఆర్‌. రెహమాన్‌ మార్వెల్‌ భారత అభిమానుల కోసం పాట కంపోజ్‌ చేశారు. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ పాటను రూపొందించారు. సోమవారం ముంబయిలో జరిగిన కార్యక్రమంలో ఈ పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమం కోసం దర్శకుడు జో రుస్సో ఆదివారం ముంబయి చేరుకున్నారు. ఈ పాటలో రెహమాన్‌ మార్వెల్‌ సూపర్‌ హీరోల సాహసం గురించి పాడుతూ కనిపించారు. ప్రపంచం రేపటితో అంతం అయిపోవచ్చు.. కానీ వారసత్వం ఎప్పటికీ జీవంతో ఉంటుందని సాగే ఈ పాట అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

మార్వెల్‌ స్టూడియోస్‌ అందిస్తున్న ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ ఏప్రిల్‌ 26న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఆంటోని రుస్సో, జో రుస్సోలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘మా దేశంలో చాలా మంది మార్వెల్‌ అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’కు సరిపోయేలా ఏదైనా చేయమని చాలా ఒత్తిడి వచ్చింది. నేను కంపోజ్‌ చేయబోతున్న పాటను మార్వెల్‌ అభిమానులు, సంగీత ప్రియులు ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నా’ అని గతంలో రెహమాన్‌ అన్నారు.

Leave a Reply

*