తారక్‌ను పికప్‌ చేసుకున్న చరణ్‌

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం గుజరాత్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెట్‌లో తీసిన ఓ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో స్కూటీపై తారక్‌ వ్యాన్‌ దగ్గరికి వెళ్లిన చరణ్‌ ఆయన్ను పికప్‌ చేసుకున్నారు. అక్కడి నుంచి తారక్‌ బండిని నడిపారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. గుజరాత్‌లోనే మరో 45 రోజులు షూటింగ్‌ జరగనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఆలియా భట్‌, డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ కథానాయికల పాత్రలు పోషిస్తున్నారు. అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమరం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దానయ్య నిర్మాత. వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదే సినిమాలో బాలీవుడ్‌ నటులు వరుణ్‌ ధావన్‌, సంజయ్‌ దత్‌ నటించే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది.
 

Leave a Reply

*